18 April, 2026 | 11:38 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

మహేష్‌కుమార్‌గౌడ్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా మాట్లాడుతున్నారు

23-06-2025 02:03 AM

బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 

నిజామాబాద్ జూన్ 22: (విజయ క్రాంతి): టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోలీస్ ఇన్వెస్టింగ్ అధికారిగా మాట్లాడుతున్నారు అని, కేటిఆర్ ను జైలుకు పంపడమే లక్ష్యంగా మాట్లాడుతున్నరనీ ప్రతి పక్ష నాయకులను జైల్లో పెట్టే కార్యక్రమాలు ఎక్కువరోజులు సాగవు అని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని బి ఆర్ ఎస్ కార్యాలయంలోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్  రెడ్డి మాట్లాడుతూ.

పార్టీ అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ లో ఉండగా ఇలాంటి వాక్యాలు చేయటం అది కాదన్నారు, కాంగ్రెస్ రైతు బరోసా కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అని ఏద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని రైతులను మరోసారి కాంగ్రెస్ మోసం చేసే ప్రయత్నం చేస్తుందని,

రైతుబంధు రుణమాఫీ పూర్తిచేయని కాంగ్రెస్ కు ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి రైతుల పై ప్రేమ లేదు లేదని, రైతుబంధు,రుణమాఫీ,బోనస్ విత్తన పంపిణీ ఇలా అన్నింట్లో కాంగ్రెస్ మోసం చేసింది అని మండి పడ్డారు.

రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది.

కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటే, అందుకే బీజేపీ ఎంపీలు ఉన్నచోట మంత్రి పదవులు ఇవ్వటం లేదు అన్నారు ఈ విలేకరుల సమావేశంలో నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఠాకూర్ ధరమ్ సింగ్ సత్య ప్రకాష్ జడ్పీ మాజీ చైర్మన్ దాదన్న విఠల్రావు ఇంకా తదితరులు హాజరయ్యారు.