2 April, 2026 | 7:36 PM

మహేష్ కుమార్ పర్యటన విజయవంతం చేయాలి

02-04-2026 06:13 PM

డిసిసి అధ్యక్షురాలు సుగుణ

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాపర్యటన నేపథ్యంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ గురువారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ మాట్లాడారు.  ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు ఆసిఫాబాద్‌లోని రోజ్ గార్డెన్‌లో జిల్లా స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎఫైర్స్ కమిటీ సభ్యులు, అలాగే పార్టీ అనుబంధ సంఘాలైన యూత్ కాంగ్రెస్, మహిళ కాంగ్రెస్, NSUI, సేవాదళ్, కిసాన్ కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు, సభ్యులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు,ముఖ్య కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలని సుగుణక్క పిలుపునిచ్చారు.పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేయడం లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ హాజరవుతారని తెలిపారు. సమావేశంలో నూతన జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిర్వహించి, నియామక పత్రాలను అందజేస్తారని వెల్లడించారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యాం నాయక్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఇరుకుల మంగ,నాయకులు గాదెవేణి మల్లేష్,సత్యనారాయణ, పెందూర్ సుధాకర్, సిడాం తిరుపతి, తారీక్ బాయ్,జక్కన్న, ఇగురపు సంతోష్, బానుచందర్,మారుతీ పటేల్,మోహన్,షేక్ మొహమ్మద్,సంతోష్,సుజిత్,ఆత్రం భీమ్ రావ్, కాశిఫ్ హష్మీ తదితరులు పాల్గొన్నారు.