16 July, 2026 | 12:52 PM

ఆకాశహర్మ్యాలలో మైవాన్

21-04-2024 12:00 AM

హైదరాబాద్, విజయక్రాంతి: నిర్మాణ రంగంలో సాంకేతికత పెరుగు తున్నది. గతంలో ఇల్లు నిర్మించాలంటే ఏండ్లు గడిచేది. శ్లాబులు వేసి, షట్ట రింగ్ తీసి, బ్రిక్ వర్క్ కట్టి, ప్లాస్టరింగ్ చేసి, విద్యుత్తు కనెక్షన్లు, ప్లంబింగ్ లైన్స్ వంటి వాటికోసం చాలా సమయం తీసుకునేవారు. కానీ నేడు మైవాన్ టెక్నాలజీ రాకతో ఒకటిరెండు నెల ల్లోనే ఆకాశ హర్మ్యాలు సిద్ధం అవు తున్నాయి. హైరేజ్ భవంతులు నిర్మి స్తున్న కొందరు బిల్డర్లు కేవలం ఏడెనిమిది రోజుల్లో ఒక్కో ఫ్లోరును వేస్తున్నారు. దీంతో గతంలో ఐదారు ఫేజులల్లో అయ్యే నిర్మాణ పనులను ప్రస్తుతం సింగిల్ ఫేజులో చేస్తున్నారు. 

బాచింగ్ ప్లాంట్స్ ఏర్పాటు..

నగరంలో పేరుగాంచిన మైహోమ్, అపర్ణా, రాజపుష్ప, ఎస్‌ఎంఆర్, పౌలోమీ, హాల్మార్క్, లాన్సమ్ వంటి బడా నిర్మాణ సంస్థలు సొంతంగా బాచింగ్ ప్లాంట్స్ పెట్టుకు న్నాయి. దీని వలన నిర్మాణ రంగ కార్మికుల సంఖ్య తగ్గడంతో పాటు భవంతులు నిర్మిస్తున్న సైటులోనే పని పూర్తవ డంతో పాటు సిమెంట్, ఇసుక, కంకర అన్నీ నిర్ణీత పరిమాణంలో మిక్స్ అవు తుండటం వలన ఇండ్ల నాణ్యత పెరు గుతుందని బిల్డర్లు పేర్కొంటున్నారు.  

డిమాండ్‌కు తగినట్లుగా...

కరోనా సమయంలో ఉత్పన్నమైన పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు సొంతింటి కలను సాకారం చేసుకు నేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేసి ఇండిపెం డెంట్ ఇల్లు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమెత లేదు. కాబట్టి నగరాల్లో సొంతిల్లుండాలని భావిస్తున్న మెజార్టీ ప్రజలు కొంత తక్కవ ధరలో లభ్య మయ్యే అపార్ట్ మెంట్లలో ప్లాట్లను కొనుగోలు చేసేం దుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజల డిమాండ్‌కు తగిన ట్లుగా నగర శివారుల్లో అపార్ట్‌మెం ట్లను విరివిగా నిర్మిస్తున్నారు. అయితే మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ సమయంలో ఎక్కువ అపార్ట్‌మెంట్లు నిర్మించి విక్రయించేందుకు మైవాన్’ టెక్నాలజీ ఎంతో ఉప యుక్తంగా ఉందని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు.