2 May, 2026 | 10:53 PM

మొక్కజొన్న కొనుగోలు చేయాలి

02-05-2026 09:30 PM

సిపిఎం రైతు సంఘం డిమాండ్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు పండించిన మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ రైతు సంఘం డిమాండ్ చేసింది. గన్ని సంచులు, లారీలను తక్షణమే అందుబాటులోకి తీసుకువచ్చి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరింది. శనివారం సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్లో గన్ని సంచుల కొరత, రవాణా సౌకర్యాల లోపం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.