4 April, 2026 | 2:06 AM

బాలానగర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం

04-04-2026 12:49 AM
  1. మంత్రి తుమ్మలకు వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వినతి
  2. కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు తుమ్మల ఆమోదం
  3. మంత్రులు వాకిటి శ్రీహరి, తుమ్మల కు కృతజ్ఞతలు తెలిపిన అనిరుధ్ రెడ్డి

బాలానగర్ , ఏప్రిల్ 3: మండలం లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమోదం తెలిపారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, రాష్ట్ర క్రీడ లు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహ రి చేసిన విజ్ఞప్తి పై తుమ్మల తక్షణమే సానుకూలంగా స్పందించారు.ఈ ఉదంతం వి వరాల్లోకి వెళ్తే, శుక్రవారం బాలానగర్ మండలం లోని మొదంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీ హరి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాజరు అ య్యారు.

ఈ సందర్భంగానే మండలానికి చెందిన రైతులు మొక్కజొన్న అమ్మకాల్లో ఇ బ్బందులను గురించి ఎమ్మెల్యే, మంత్రి దృ ష్టికి తీసుకు వచ్చారు. అయితే ఈ విషయం గురించి పూర్తి అవగాహన కలిగిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రైతులతో పాటుగా తాను కూడా మొక్కజొన్న రైతుల కష్టాలను మంత్రి కి వివరించారు.

రాష్ట్రంలో మొక్కజొన్న కు మద్దతు ధర రూ.2400 ఉండగా బాలానగర్ మండలం లో అత్యధికంగా మొక్క జొన్న పండిస్తున్న రైతులు స్థానికంగా మొక్క జొన్న కొనుగోలు కేంద్రం లేక పోవడం తో రూ.1600 లకే అమ్ముకోవాల్సి వస్తోందని, దీని వల్ల పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాక రైతులు పూర్తిగా నష్టపోతున్నారని చెప్పారు.

మక్కలు కొనుగోలుకు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రాన్ని నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేశారని, అయితే అది చాలా దూరంగా ఉండటం తో బాలానగర్ నుంచి నాగర్ కర్నూలు కు వెళ్లలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో మొక్కజొన్న రైతులు తాము పండించిన పంటను తక్కువ ధరకే అమ్ముకొని నష్ట పోతున్నారని తెలిపారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో బాలానగర్ లో కూడా మొక్క జొన్న కొనుగోలు కేం ద్రం ఏర్పాటు చేసి రైతులు నష్ట పోకుండా చూడాలని మంత్రి వాకిటి శ్రీహరి నీ అనిరు ధ్ రెడ్డి కోరారు.

ఈ విషయం గా స్పందించిన శ్రీహరి వెంటనే మంత్రి తుమ్మలకు ఫో న్ చేసి బాలానగర్ లో మొక్క జొన్న రైతుల కష్టాలను వివరించారు. ఇక్కడ వెంటనే ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి తుమ్మల కూడా ఈ విష యం గా సానుకూలంగా స్పందించి బాలానగర్ లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా మంత్రి తుమ్మల తో మాట్లాడి మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రి తుమ్మల, వాకిటి శ్రీహరి కి కృతజ్ఞతలు తెలిపారు.