బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
కొత్తపల్లి, ఏప్రిల్ 3(విజయక్రాంతి): కొత్తపెల్లి మండలం బద్దిపల్లి గ్రామంలో శ్రీ అలివేలు మంగ, పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కమిటీ సభ్యులు శుక్రవారం రోజున కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను ఆలయ కమిటీ బాధ్యులు వారి నివా సంలో కలిసి బ్రహ్మోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రూ పొందించిన కరపత్రాలను ఎంఎల్‌ఏ ఆవిష్కరించారు. తదుపరి ఎంఎల్‌ఏ మాట్లాడుతు
ఈనెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆస్వామి వారి కృపా కటాక్షాలు పొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బద్దిపల్లి సర్పంచ్ తాండ్ర శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ పోరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలు దాసరి శరత్, కోశాధికారి మిట్ట కమలాకర్, ముఖ్య సలహాదారు ఉప్పు రాజశేఖర్, వైస్ చైర్మన్లు రాచకొండ శ్రీనివాస్, తాండ్ర సుధాకర్,పాలకవర్గ సభ్యులు, ఆలయ కమిటీ బాధ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




