బెజ్జంకి జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరణ
పాల్గొన్న ఎమ్మెల్యే సత్యనారాయణ
బెజ్జంకి,మార్చి25:సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఏకశిలపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నన్నాయి. జాతర పోస్టర్స్ గురువారం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించి మాట్లాడారు. జాతరను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఈనెల 29 స్వామి వారి కళ్యాణం, ఏప్రిల్ 2న శకటోత్సవం, ఏ ప్రిల్ 4 తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించబడుతాయని ఆలయ అధికారులు తెలిపా రు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్, సభ్యులు ఒగ్గు దామోదర్, రావుల నర్సయ్య, కొండ్ల ప్రకాష్, ప్రసాద్, మాదుసుదన చారి,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి ఊరేగింపు
బెజ్జంకి గ్రామంలో నుంచి ఘనంగా ఊరేగింపుగా గుట్టపైకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణలతో, మంగళ వాయిద్యాలతో భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు. సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన ఈ కార్యక్రమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు గుట్టపైకి చేరుకొని పూజలు నిర్వహించారు.




