9 August, 2026 | 2:47 AM

తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ..

09-08-2026 12:00 AM
  1.   9 తులాల బంగారం 80 తులాల వెండి, రూ.2 లక్షల నగదు అపహరణ
  2. రావల్ కోల్ పట్టణంలో దొంగల హల్ చల్

మేడ్చల్ అర్బన్ ఆగస్టు 8(విజయక్రాంతి) : ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రావల్ కోల్ పట్టణంలో భారీ చోరీ చోటుచేసుకుంది.రావల్ కోల్ పట్టణానికి చెందిన బం దెల ముత్యాలు కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో దుండగులు చోరికి ఒడిగట్టారు.ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించిన దొంగలు తలుపు తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బెడ్రూమ్లోని ఆల్మార్,లాకర్ లను ధ్వంసం చేసి లోపల ఉన్న నగదు బంగారు ఆభరణాలను దొంగిలించారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో దాచి పెట్టిన 9 తులాల బంగారం,80 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.2 లక్షల నగదును దుం డగులు అపహరించుకుపోయారు.ఇంటి య జమానులు తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి త లుపు తాళాలు పగులగొట్టి ఉండటం అల్మారిలోని బట్టలు వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో బాధితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ నేపథ్యంలో ఇంట్లో సర్వ స్వం కోల్పోయామని కన్నీరు మున్నీరవుతున్నారు.ఈ ఘటనపై సమాచారం అందు కున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమో దు చేసి క్లూస్ టీమ్,డాగ్ స్క్వాడ్ సహాయం తో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.