21 July, 2026 | 6:15 AM

అర్ధరాత్రి తప్పిన పెను ప్రమాదం

20-07-2026 02:12 PM

సిద్దిపేట క్రైం, జూలై 20 : సిద్దిపేటలోని రేణుకానగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణం వైపు దూసుకెళ్లింది. మూసివున్న దుకాణం షెటర్, ముందు ఉన్న ఓ చెట్టును బలంగా ఢీ కొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో చెట్టు నేల కూలగా, షెటర్ దెబ్బతింది. కారు ముందుభాగం ధ్వంసమైంది. అర్ధరాత్రి జనసంచారం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదృష్టవశాత్తు వారు గాయపడలేదు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు బ్రీత్ అనలైజర్ ద్వారా గుర్తించారు.