calender_icon.png 21 February, 2026 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

21-02-2026 05:52:38 PM

సుల్తానాబాద్ కోర్టు జడ్జి దుర్గం గణేశ్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సుల్తానాబాద్ మున్షిప్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. శనివారం మండల న్యాయ సేవాదికారా సంస్థ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గట్టేపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ జూనియర్ సివిల్  జడ్జి దుర్గం గణేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందాలని, చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పలు గ్రామాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గ్రామాల్లో కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలుకు సంబంధించి సుల్తానాబాద్ కోర్టులో న్యాయసేవాధికార సంస్థను సంప్రదించినట్లయితే తగు న్యాయ సహాయం అందిస్తామన్నారు. రాజీ మార్గంలో ఇరు వర్గాల కేసులను లోక్ అదాలత్ లలో పరిష్కరించు కోవచ్చిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతి రెడ్డి, న్యాయవాది కోడం అజయ్, సర్పంచ్ దేవేందర్, ఉప సర్పంచ్ గుర్రం రేణుక, గ్రామ కార్యదర్శి మీనా, వార్డు సభ్యులు లక్ష్మణ్, సంతోష్, రమేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.