04-02-2026 01:19:51 AM
నిర్మల్, ఫిబ్రవరి ౩ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోరులో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష మైన భారత రాష్ట్ర సమితి బిజెపి ఎంఐఎం పార్టీలకు ప్రతిష్టాత్మక కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఆయా వార్డు లో బలమైన అభ్యర్థులను జనం సర్వే ఆధారంగా పోటీలో దింపాయి.
నిర్మల్ జిల్లాలో నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. నిర్మల్ లో 42 బైంసాలో 26 ఖానాపూర్ లో 12 వార్డులు ఉన్నాయి మెజార్టీ స్థానాలు దక్కించుకున్న వారికి మున్సిపల్ పీఠాలు దక్కే అవకాశం ఉంది. నిర్మల్ జనరల్ బీసీ మహిళకు కేటాయించగా బైంసా ఖానాపూర్ లో జనరల్ కు కేటాయించారు. నామినేషన్లు ఉపసంహరణకు మంగళవారం చివరి తేదీ కావడంతో ఆయా వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థిలో కొందరు ఉపసంహరించుకోగా మరికొందరు పోటీలో ఉన్నారు.
ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి రాష్ట్ర పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్ నేతృత్వంలో నిర్మల్ జిల్లా నేతలు బెడుమ బుజ్జి పటేల్ ఇంద్రకరణ్ రెడ్డి శ్రీహరి రావు నారాయణరావు పటేల్ విట్టల్ రెడ్డి అభ్యర్థులను గెలిపించ బాధితులు స్వీకరించారు. ఇక బిజెపి విషయానికొస్తే నిర్మల్ లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముధోల్‌లో ఎమ్మెల్యే రామారావు పటేల్ ఖానాపూర్ లో జిల్లా పార్టీ అధ్యక్షులు రితీష్ రాథోడ్ సీనియర్ నేతలతో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
భారత రాష్ట్ర సమితి బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇంచార్జ్తో జిల్లా నేతలు జాన్సన్ నాయక్ రామ్ కిషన్ రెడ్డి రమాదేవి లోలం శ్యాంసుందర్ మార్బండ రాము వంటి కీలక నేతలు పార్టీని గెలిపించే బాధ్యతను స్వీకరించారు. ఎంఐఎం తరఫున జాబీర్ అహ్మద్ , అజీమ్ బిన్ అయ్యా పార్టీ అభ్యర్థులను ప్రకటించారు నామినేషన్ లో ఉపసమరణ అభ్యర్థుల ప్రకటన గుర్తులు రావడంతో ఇక ప్రచారంపై వారు దృష్టిపెట్టారు.
జిల్లాలో అగ్ర నేతల ప్రచారం
జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు అగ్ర నేతల ప్రచారంపై దృష్టి పెట్టారు. జిల్లావ్యాప్తంగా మూడు మున్సిపాలిటీలో ప్రధాన నాలుగు రాజకీయ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో ఇలాగైనా మున్సిపల్ పీఠాలను దక్కించుకోవాలని ఆ పార్టీ నేతలు వ్యూహం రూపొంది స్తున్నారు.
ఇందులో భాగంగా ఈనెల 8న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్మల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు మరుసటి రోజు కేంద్రమంత్రి బండి సంజయ్ బైంసా ఖానాపూర్ ప్రచారం నిర్వహిస్తారు. ఇక కాంగ్రెస్ తరపున ఆ పార్టీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ఇన్చార్జి మంత్రులు ప్రచారం నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించారు.
భారత రాష్ట్ర సమితి అగ్ర నాయకులు కేటీఆర్ బైంసాలో నిర్మల్ లో హరీష్ రావు ఖానాపూర్లో కేటీఆర్ ప్రచారం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు మీరు ఈనెల 7 8 తేదీల్లో వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపారు. ఎంఐఎం పార్టీ తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అసవుద్దీన్ ఓవైసీ ఈనెల ఐదున నిర్మల్ జిల్లాకు వస్తుండగా ఏడున అక్బరుద్దీన్ ఓవైసీ బైంసా నిర్మల్ ఖానాపూర్ లో రోడ్ షో నిర్వహించేలా ఏర్పాటులు చేస్తున్నారు. నాలుగు పార్టీలకు నిర్మల్ మున్సిపల్ పీఠాలు ప్రతిష్టాత్మక కావడంతో గెలుపు ఓటములు ఎలా ఉన్నా ప్రచారంలో మాత్రం అగ్రస్థానంలో ఉంటుందని ప్రజలు విశ్లేషిస్తున్నారు.