calender_icon.png 2 February, 2026 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ను గెలిపించండి

02-02-2026 12:00:00 AM

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

మరిపెడ, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ను గెలిపించండి. రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అన్నారు. డోర్నకల్ ఎ మ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ క్యాంప్  కార్యాలయం లో ఆదివారం  జరిగిన ముఖ్య నేతల సమావేశంలో పార్టీ శ్రే ణులకు దిశానిర్దేశం చేశారు.మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులకు 15 కాంగ్రెస్ అభ్య ర్థులను గెలిపించాలని పార్టీ నాయకులకు సూచించారు. మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.

ప్రభుత్వ విజయాలే మా గెలుపు గుర్రాలు

గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిందని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తక్కువ కాలంలోనే అనేక హామీలను నెరవేర్చిందని మంత్రి స్పష్టం చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు విజయవంతం గా అమలు చేస్తున్నాం.గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా ఇవ్వలేదు, కానీ మేము నియోజకవర్గానికి 3,500 ఇం దిరమ్మ ఇళ్లు కేటాయించాం. రైతు రుణమాఫీతో పాటు సన్న వడ్లకు రూ. 500 బోనస్ అందిస్తూ అన్నదాతను ఆదుకుంటున్నాం. గ్రూప్ 1 నుండి పోలీస్, టీచర్ పోస్టుల వర కు దాదాపు 70 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాం. బీసీలకు పెద్దపీట - 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.

మున్సిపల్ ఎన్నికల్లోనూ స్థానికంగా ఇదే నిష్పత్తిలో టికెట్లు కేటాయించాలని పార్టీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.ఫెడరల్ వ్యవస్థలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని, ఏపీకి నిధులు ఇస్తూ తెలంగాణను విస్మరిస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్, బీజేపీలు చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నిలదీయాలని కోరారు.టికెట్ ఆశించడంలో తప్పులేదని, అయితే పార్టీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని అన్నారు. ఈ సమావేశం లో డిసిసి అధ్యక్షులు ఉమా మురళి నాయక్, జిల్లా నా యకులు వంటికొమ్ము యుగేందర్ రెడ్డి, మ రిపెడ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గూగులోతు రవి నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.