16 April, 2026 | 8:01 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సిపిఎం పట్టణ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

22-06-2025 07:25 PM

సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి..

భద్రాచలం (విజయక్రాంతి): సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జూన్ 23, 24 తేదీలలో కామ్రేడ్ బండారు చందర్రావు భవన్ సిపిఎం కార్యాలయం నందు జరుగుతాయని పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ప్రజాసంఘాల బాధ్యులు ఈ శిక్షణా తరగతులకు హాజరై జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి(CPM Urban Secretary Gaddam Swamy) విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో నేడు దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకీ మారుతున్న రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు.

జూన్ 23 ఉదయం పార్టీ విశిష్టత అఖిలభారత మహాసభల రాజకీయ తీర్మానం అంశంపై పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఏజే రమేష్ పాఠ్యాంశమును బోధిస్తారని, మధ్యాహ్నం నుండి పార్టీ నిర్మాణం పని పద్ధతులపై పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మచ్చ వెంకటేశ్వర్లు పాఠ్యాంశం బోధిస్తారని తెలిపారు. జూన్ 24 ఉదయం మతోన్మాదం వివిధ తరగతులపై ప్రభావం అనే అంశంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బండారు రవికుమార్ బోధిస్తారని పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రాధాన్యత కర్తవ్యాలపై పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుక్య రమేష్ మధ్యాహ్నం క్లాస్ ఉంటుందని అన్నారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.