7 July, 2026 | 6:38 PM

Breaking News

ఆరేపల్లి రాహుల్ ను సన్మానించిన అడ్వకేట్స్   •   సీడబ్ల్యూఎస్‌ఎన్ పిల్లలందరూ భవిత కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలి   •   సీసీ రోడ్ల పనులు ప్రారంభం   •   జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి   •   విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలలు   •   "సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •  

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

22-06-2025 07:27 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-10 బ్యాచ్​ పదో తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నారు. ఆదివారం వారంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుని ఆనందంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు రక్షన్ ఆంజనేయులు, సుభాష్, నస్రిన్, నాగరాజు, జ్యోతి, సరిత మాణిక్యరావు, జ్యోతి, రాజ్​లను ఘనంగా సన్మానించారు.