4 May, 2026 | 3:11 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

శుద్ధ జలాన్ని సద్వినియోగం చేసుకోవాలి

09-03-2026 01:55 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ప్రజల సంక్షేమంలో భాగంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న శుద్ధ జలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. ఆదివారం జిల్లాలోని రెబ్బెన మండలం రాంపూర్ గ్రామంలో జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన జల మహోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

గతంలో నెలకొని ఉన్న త్రాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా మొదటిసారి గ్రామంలో ప్రతి ఇంటికి శుద్ధ జలాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వేసవి కాలంలో త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ లు సిద్ధికి, రాకేష్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.