18 August, 2026 | 2:58 AM

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

18-08-2026 02:04 AM

ఎంపీడీవో భరత్ కుమార్

తాడ్వాయి,ఆగష్టు,17( విజయ క్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాడ్వాయి ఎంపీడీవో భరత్ కుమార్ తెలిపారు.

తాడ్వాయిలో సోమవా రం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజర వుతారని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణికి 6 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో తహసిల్దార్ శ్వేత, ఎంఈఓ రామస్వామి, ఏవో నరసింహులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.