1 July, 2026 | 7:08 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

విచారణ నెంబర్ సద్వినియోగం చేసుకోవాలి

26-03-2025 10:14 PM

ఆర్టీసీ డిఎం రాజేశ్వర్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అసిఫాబాద్ డిపో నుండి నడిచే బస్సుల సమయాలు, రూట్ వివరాలు తెలుసుకోవడం ఇక సులభతరం అని ప్రయాణికులు 9493282510  విచారణ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని డిపో మేనేజర్ కే.వి. రాజశేఖర్  తెలిపారు. ఈ సేవ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ప్రయాణించే వారికి సమాచారం తక్షణమే అందుబాటులోకి రానుంది. రోజూ వందలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న అసిఫాబాద్ డిపోలో ఈ కొత్త విచారణ సౌలభ్యం ప్రవేశపెట్టడం శుభపరిణామంగా భావిస్తున్నారు. "బస్సు షెడ్యూల్‌లు, రూట్ మార్పులు లేదా ఇతర సమస్యలపై స్పష్టత కోసం ఈ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రయాణికుల సమయం, శ్రమ ఆదా చేయడమే మా లక్ష్యం అని డిపో మేనేజర్ వివరించారు.