1 July, 2026 | 7:48 PM

Breaking News

బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •  

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు

01-07-2026 06:38 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్ పార్క్ నిర్మాణంలో జరుగుతున్న భారీ అవినీతి, సీతారామ ప్రాజెక్టు మట్టి అక్రమ రవాణాపై భారతీయ జనతా పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఇందులో భాగంగా సాలి శివకృష్ణ నేతృత్వంలో బీజేపీ బృందం ఈరోజు బుగ్గపాడు ఫుడ్ పార్క్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి, క్షేత్ర పరిస్థితులను సమీక్షించారు.

జాతీయ స్థాయికి చేరిన అక్రమాల వ్యవహారం:

ఈ భారీ అవినీతిపై బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి  ఇప్పటికే స్పందించి, పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను కోరారు. అంతేకాకుండా, ఈ వ్యవహారాన్ని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న ఈ దోపిడీని నిలువరిస్తుందనే నమ్మకాన్ని బీజేపీ నాయకులు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పాల్గొన్న బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ని వీరంరాజు మాట్లాడుతూ... సీతారామ ప్రాజెక్టు నుంచి మట్టిని ఏ అనుమతులతో, ఎవరికి లాభం చేకూర్చేలా తరలిస్తున్నారు? దీనిపై లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు?. రైతులకు పరిహారం పేరుతో ఎకరాకు రూ. 1.30 లక్షలు ఇచ్చి, మొత్తం రూ. 3 కోట్ల లోపు ఖర్చు చేసిన ప్రభుత్వం, మిగిలిన రూ. 100 కోట్లకు పైగా నిధులను ఎక్కడ వినియోగించినది,  ఏ అకౌంట్లకు మళ్లించింది?.  స్థానిక యువతకు ఉపాధి, పారిశ్రామికంగా అభివృద్ధి అవకాశాలు కల్పించాల్సింది పోయి, వారి పొట్ట కొట్టి, ఆంధ్ర కంపెనీలకు అప్పనంగా భూములు కట్టబెట్టడం వెనుక ఉన్నది ఎవరు? 'దీపక్ నెక్స్ట్ జన్' వంటి సంస్థలకు తక్కువ ధరకు భూములు కేటాయించడం వెనుక ఎవరి వాటాలు ఎంత ఉన్నాయి?

ప్రజాక్షేత్రంలో దోషుల ఎండగట్టడం ఖాయం:

బీజేపీ నాయకులు మాట్లాడుతూ... "ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును దోచుకుని, స్థానికులను విస్మరిస్తే ఊరుకునేది లేదు. దోషులు ఎంతటి వారైనా సరే, రాబోయే రోజుల్లో వారిని ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. ముఖ్యంగా టీజీఐఐసీ (TGIIC) అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా?" అని సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో సాలి శివ కృష్ణ మరియు మాజీ జిల్లా అధికార ప్రతినిధి పడగల మధుసూదన్ రావు జిల్లా సీనియర్ నాయకులు చీకటి వసంతరావు మండల ఉపాధ్యక్షులు ఎస్కే సుభాని పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక రైతులు పాల్గొని, తమ నిరసనను వ్యక్తం చేశారు.