అరుణోదయ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
ఇల్లందు, (విజయక్రాంతి): నేడు ఇల్లందులో జరగబోయే అరుణోదయ రాష్ట్ర సదస్సును( Arunodaya State Conference) జయప్రదం చేయాలని పోచారం గ్రామంలో శుక్రవారం అరుణోదయ సాంప్రతిక సమైక్య నాయకులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరుణోదయ రాష్ట్ర నాయకుడు చిరంజీవి, జిల్లా నాయకులు భిక్షంలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 11సంవత్సరాల నుండి ప్రజల మౌలిక సమస్యలను పక్కనపెట్టి కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు ప్రజల సంపదను దోచిపెట్టే పనిలో ఉన్నారన్నారు. కార్మిక, రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని ప్రతి ఒక్కరూ దీనిని ఖండించాలన్నారు.
కవులు కళాకారులు ఆపరేషన్ కగరుకి వ్యతిరేకంగా కళల రూపంలో పాటల రూపంలో ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. అమాయక గిరిజన ప్రజల్ని ఎన్కౌంటర్ పేరుతో చంపుతున్నారని ప్రజల హక్కుల కోసం జరిగే పోరాటంలో కళాకారులు తమ గళం వినిపించాలని, నాటి తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ కళాకారుల సమైక్యవాదుల దోపిడీని పాటల రూపంలో పాడి ప్రజలను చైతన్యం చేశామని గుర్తు చేశారు. ఇందులో భాగంగా జులై 19న ఇల్లందులో జరిగే ప్రదర్శన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ పోచారం కార్యదర్శి తుడం శ్రీను, మాజీ సర్పంచ్ శ్రీను, అరుణోదయ సాంస్కృతిక సమైక్య నాయకులు బిక్షం, కాంపాటి శ్రీను, పివైఎల్ నాయకులు మోతిలాల్, లక్ష్మణ్, కోటి, జగన్ తదితరులు పాల్గొన్నారు.




