18-07-2025 09:21:52 AM
చర్ల, (విజయక్రాంతి): విద్యార్దులు బాల్య దశనుండే తాము సాదించుకునే లక్ష్యాలను నిర్దేసించుకోవాలని సీనియర్ న్యాయవాదులు కొర్సా కృష్ణార్జున్ రావు, పర్శిక సోమరాజు అన్నారు. అంతర్జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా చర్ల మండల న్యాయవాదుల సంఘం ఆద్వర్యంలో వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం విద్యార్దులకు అరటిపండ్లు, యాపిల్, బత్తాయి పండ్లను పంపిణీ చేసారు. కేక్ కట్ చేసి విద్యార్దులకు మిఠాయిలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆదివాసీ విద్యార్దుల అభ్యున్నతి కొరకు చర్లలో విద్యార్ది నిలయం ఏర్పాటు చేయడం ఆదివాసీ సమాజానికే గర్వకారణమని అన్నారు. ప్రతి విద్యార్ది తాను పెద్దయిన తర్వాత ఏమి చేయాలో చిన్ననాటి నుండే నిర్దేసించుకొని అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పేద విద్యార్దుల అభ్యున్నతి కొరకు కృషిచేయాలన్నారు.
సంస్ద అందిస్తున్న అవకాశాలను సద్వినియోగపరుచుకొని ఉన్నత స్దితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సమయం వృదా చేసుకోకుండా చదువులపై దృష్టి సాదించాలని అన్నారు. పాఠశాలలో ఉపాద్యాయులు బోదించే పాఠాలను శ్రద్దగా విని జీవితాలకు సార్దకత చేకూర్చుకోవాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంకు ముఖ్య అతిదిగా హాజరయిన గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అద్యక్షుడు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ వనవాసీ సంస్దతో పాటు దాతలు అందచేస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవాలని పేర్కొన్నారు. వనవాసీ విద్యార్దుల బాగోగులు చూసుకునేందుకు ఆదివాసీ ఉద్యోగులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు. అంతర్జాతీయ న్యాయవాదుల దినోత్సవంను గిరిజన విద్యార్దుల నడుమ చేసుకోవడం అబినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పపరిటాల సంతోష్, జి లక్ష్మణ్ కుమార్, ఇర్ప ప్రకాష్, జి ఎస్ పి వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్, పాలెం నాగరాజు, వనవాసీ ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు, వనవాసీ నిలయ ఉపాద్యాయులు జవ్వాది మురళీకృష్ణ, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు.