18 April, 2026 | 10:09 AM

క్రికెట్‌లో శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

16-05-2025 01:12 AM

ఏఎస్‌పీ నాగేశ్వరరావు

సూర్యాపేట, మే 15 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించబడుతున్న ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావు,నల్గొండ జిల్లా కార్యదర్శి అమీనోద్దీన్ లు అన్నారు. 

రెండున్నర లక్షల విలువ చేసే క్రికెట్ మ్యాట్, కిట్టులు, కసరత్తు సామాగ్రి తో కూడిన వివిధ ఆట వస్తువులను గురువారం క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని మంచి క్రీడాకారులుగా తయారు కావాలని జిల్లాకు మంచి పేరు తేవాలని రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయిలో ఆటగాళ్లు ఎదగాలన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కోచ్ షఫీ ఉద్దీన్, సూర్యాపేట జిల్లా హెచ్సీఏ కోచ్ షేక్ ఉస్మద్, ట్రస్మా కార్యదర్శి సంతోష్ కుమార్, సాయి క్రాంతి, టీచర్ జిల్లేపల్లి జానయ్య పాల్గొన్నారు.