18 April, 2026 | 8:12 AM

వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి

16-05-2025 01:14 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, మే 15 (విజయక్రాంతి) : వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నిర్వాహకులని ఆదేశించారు. గురువారం మద్దిరాల మండలం కేంద్రం లోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా ధాన్యం నాణ్యతను, రికార్డులను తనిఖీ చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలకి  లారీలను పంపిస్తామని త్వరగా కాంటా వేసి ధాన్యం మిల్లులకి తరలించాలని కేంద్ర నిర్వాహకులకి సూచించారు. ఇప్పటి వరకు 5700 క్వింటాల ధాన్యం తరలించామని కలెక్టర్ కి నిర్వాహకులు తెలిపారు. మండలంలోని చిన్న నెమిల గ్రామంలో ఉపాధి హామీ పనులతో త్రవ్వుతున్న చేప పిల్లల పెంపకం చెరువును పరిశీలించి ఇప్పటి వరకు ఎన్ని చేప పిల్లల పెంపకం చెరువులు తయారు చేశారు అని అధికారులను ఆరా తీశారు.

ఉపాధి హామీ పనులు చేయు ప్రదేశంలో త్రాగు నీరు, టెంట్ లాంటి మౌళిక వసతులు ఏర్పాటునీ అడిగి తెలుసుకున్నారు. తదుపరీ నర్సరీని సందర్శించి బెడ్ లో ఉన్న ఖాళీలను అందులో నూతన విత్తనం ను వేసి వర్ష కాలం నాటికి మొక్కలను సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించినారు. అనంతరం నూతనకల్ మండలం ఎర్రపాడు ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి పలు విషయాలను ఆరా తీశారు.

ఈయన వెంట సివిల్ సప్లై మేనేజర్ ప్రసాద్, తహసిల్దార్లు అమీన్ సింగ్, ఎంపీడీవోలు సత్యనారాయణ రెడ్డి, సునీత, మండల వ్యవసాయ అధికారి మురళి, ఏపిఎం మధుసూదన్, ఏ పి ఓ వెంకన్న,ఏ పి యం మైసయ్య, రమణాకర్, సెంటర్ ఇంచార్జి లు నాగార్జున, సునీత,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.