9 June, 2026 | 1:47 AM

ధర్నాను విజయవంతం చేయండి

09-06-2026 12:42 AM

కళ్లెం కృష్ణ

యాదగిరిగుట్ట, జూన్ 8:  నిత్యవసర వస్తువులు  పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ 10న కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ కోరారు. సోమవారం  యాదగిరిగుట్ట పట్టణంలో పెంచిన నిత్యవసర వస్తువులు డీజిల్ పెట్రోలు, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈనెల10న రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్,గ్యాస్ నిత్యవసర ధరలను నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలన్నారు.

బిజెపి పాలనలో సామాన్యుడు బతుకుబారంగా మారిందని డీజిల్, పెట్రోలు, వంట గ్యాసు పప్పులు, నూనెలు, కూరగాయలు వంటి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయన్నారు. అచ్చేదిన్ వస్తాయని చెప్పి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు జేబుకు చిల్లులు పెడుతున్నాతన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బండి జంగమ్మ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేరబోయిన మహేందర్, సిపిఐ మండల కార్యదర్శి కలపెల్లి మహేందర్, సిపిఐ పట్టణ కార్యదర్శి బబ్బురి శ్రీధర్, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు పేరబోయిన పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.