9 June, 2026 | 1:43 AM

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

09-06-2026 12:41 AM

కలెక్టర్ హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 8(విజయ క్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరిం చాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం. డేవిడ్, డీఆర్వో దాసరి వేణుతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

రెబ్బెన మండలానికి చెందిన అంబిలపు కౌశిక్ కళ్యాణ్ దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కోరగా, సిర్పూర్-టి మండలం కొమ్ముగూడ గ్రామానికి చెందిన దుర్గం హోక్టు తన వ్యవసాయ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. కాగజ్నగర్కు చెందిన కవిత మండల్ తన భర్త ఎల్‌ఐసీ భీమా డబ్బులు ఇప్పించాలని వినతి అందజేశారు.

ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామా నికి చెందిన దేశబోయిన నవీన్ ఆసరా పింఛన్ బ్యాంకు ద్వారా అందించాలని కోరగా, అంకుశాపూర్ గ్రామానికి చెందిన పెరుగు కమలాబాయి తన భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. చింతలమానేపల్లి మండలం కర్జెల్లి గ్రామానికి చెందిన గందే శంకరయ్య ఆసరా పింఛన్ పునరుద్ధరించాలని, రెబ్బెన మండలం తుంగెడ గ్రామానికి చెందిన డొంగ్రి సంధ్య మానసిక దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని వినతులు అందజేశారు.

బెజ్జూర్ మండలం రెబ్బెన గ్రామానికి చెందిన మల్లేష్ ఉపాధి కల్పించాలని కోరారు.ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు సమన్వయంతో పరిశీలించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.