తిరుపతి రెడ్డి.. నీకు, కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు!
మంత్రిని విమర్శిస్తే నాలుక కోస్తాం
భీమదేవరపల్లి, జూన్ 8 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగేపల్లి గ్రామానికి చెందిన లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ కనీసం కార్యకర్త కార్యకర్త కూడా కాదని ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శిస్తే నాలుక కోస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పూరి అశోక్ ముఖర్జీ, కేతిరి లక్ష్మారెడ్డి, ముల్కనూర్ సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, కొలుగూరి రాజు, చిదురాల స్వరూప, పిడిశెట్టి కనకయ్య, ఊస కోయిల ప్రకాష్ ,ఆదరి రవీందర్ లు మీడి యా సమావేశం ఏర్పాటు చేశారు.
శనివారం భీమదేవరపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి రంగయ్యపల్లి గ్రామానికి విరాళంగా ఇచ్చిన భూమి పట్టా కాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నాడని మంత్రి పొన్నం విమర్శిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కాం గ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మంత్రి పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.
వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చి దురాల స్వరూప ఆదివారం రంగయ్యపల్లి గ్రామానికి వెళ్లి న్యాయపరంగా మాట్లాడేందుకు ప్రయత్నించగా తిరుపతిరెడ్డి గ్రామస్తులతో ఆమెపై దాడికి ప్రయత్నించినారని ఆరోపించారు. ఈ విషయంపై ఇరువర్గాలు ఒకరిపై ఒకరు వంగర ముల్కనూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.
లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి బిజెపి శ్రేణులతో కలిసి మీడి యా సమావేశం ఏర్పాటు చేసినాడు అని ఆరోపించారు. బే షరతుగా ఆయన క్షమాపణలు చెప్పకపోతే ఆయనకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు బొక్కల స్రవంతి, మాజీ సర్పంచ్ మాడుగుల కొమురయ్య, ఉపసర్పంచ్ కాశగోని మమత బాల కృష్ణ, జక్కుల అనిల్, చిట్కూరి అనిల్, శ్రీనివాస్ ,చెవ్వల బుచ్చయ్య, పచ్చునూరి కర్ణా కర్, రాజు తదితరులు పాల్గొన్నారు.






