23 May, 2026 | 7:06 PM

Breaking News

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •  

రెండో యూనిట్‌ను అందుబాటులోకి తీసుకురండి

14-09-2024 12:15 AM

ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఆదేశం

నాగార్జునసాగర్ జల విద్యుత్తు కేంద్రం సందర్శన

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): నాగార్జునసాగర్ జల విద్యుత్తు కేంద్రంలో రెండో యూనిట్ మినహా మిగతా యూనిట్లన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేయడంపై ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రోనాల్డ్‌రోస్ సంతృప్తి వ్యక్తంచేశారు. అయితే రెండో యూనిట్‌ను కూడా వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని జెన్‌కో అధికా రులను ఆయన ఆదేశించారు. శుక్రవా రం నాగార్జునసాగర్ జల విద్యుత్తు కేం ద్రాన్ని రోనాల్డ్ రోస్ సందర్శించారు.

ఈ సందర్భంగా మొత్తం 8 యూనిట్లలో 7 యూనిట్లు (ఒక్కొక్కటి 100 మెగావాట్లు) మాత్రమే సర్వీసులో ఉన్నాయని అధికారులు  వివరించారు. జనరేటర్ రోటర్ స్పైడర్ లోపంతో అది సర్వీసులో లేదని అధికారులు కార్యదర్శిరికి వివరించారు. ప్రస్తుతం అందుబాటులో లేని 2వ యూనిట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని  ఆదేశించారు.