30 June, 2026 | 10:58 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఉపాధ్యాయుల ధర్నా విజయవంతం చేయండి

05-08-2025 12:00 AM

అర్మూర్, ఆగస్టు 4 (విజయ క్రాంతి): విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కరం కోసం మంగళవారం  జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాటకమిటీ(యూఎస్ పీసీ) నాయకులు కోరారు.   ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా నాయకులు పి.విజయ్ కుమార్, ఏక్ నాథ్, వాజిద్ అహ్మద్, దేవానందం గంగాధర్ లు మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. 

బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలన్నారు. పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని, సీపీఎస్ ను రద్దుచేసి, ఓపీఎస్ ను అమలు చేయాలని, 317 జీఓ వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులందరినీ వారివారి సొంత జిల్లాలకు పంపించాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులందరికీ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ 25 ను సవరించాలన్నారు.

టైం స్కేల్ ఇవ్వాలని, వివిధ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇవ్వాలని, నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలని డిమాండ్ చేశారు.