calender_icon.png 18 November, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగ విజయోత్సవ సభను విజయవంతం చేయండి

01-12-2024 04:32:31 PM

మంథనిలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్

మంథని (విజయక్రాంతి): పెద్దపల్లిలో ఈ నెల 4వ తేదిన నిర్వహించనున్న నిరుద్యోగ విజయోత్సవ సభను విజయవంతం చేయాలని మంథనిలో ముఖ్య కార్యకర్తల సమావేశం లో మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ అన్నారు. ఆదివారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల నాలుగో తేదీన పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో జరిగే నిరుద్యోగ విజయోత్సవ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్న బహిరంగ సభకు మంథని మండలంలోని అన్ని గ్రామాల్లోని జనాలను తండోపతండాలుగా తరలించి ఈ సభను విజయవంతం చేయాలని అది ప్రసాద్ కోరారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు గ్రామం నుండి అత్యధిక సంఖ్యలో రైతులను, యూత్ కాంగ్రెస్, మహిళా సోదరిమణులను, అనుబంధ సంఘాల నాయకులను, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను తరలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమ, ప్రచార కమిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్,  కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి, నాయకులు ఎరుకల ప్రవీణ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, మాజీ ఎంపిపి కొండ శంకర్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, జిల్లా ఉపాధ్యక్షులు నూకల బానయ్య, గోటికారి కిషన్, కిసాన్ సెల్ టౌన్ అధ్యక్షులు నరెడ్ల ఓదెలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.