calender_icon.png 17 November, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు వ్యాస రచన పోటీలు

01-12-2024 04:21:58 PM

పటాన్ చెరు (విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మండల కేంద్రం జిన్నారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం మండల స్థాయి వ్యాస రచన పోటీలు నిర్వహించారు. 'పునరుద్ధరించే ఇంధన వనరుల వినియోగం' అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో 66 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి భాను ప్రకాష్ ప్రథమ, 10వ తరగతి విద్యార్థి కిరణ్ కుమార్ ద్వితీయ, కస్తూర్బా పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని శిరీష తృతీయ బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కుమారస్వామి, గిరిజన గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ వెంకటయ్య, జిన్నారం పాఠశాల పీడీ రవీందర్ రెడ్డి, వేణు, సీఆర్పీ భాస్కర్ పాల్గొన్నారు.