calender_icon.png 14 November, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు ఇంజెక్షన్ చేసుకుని మేల్ నర్స్ ఆత్మహత్య

12-04-2025 08:55:13 AM

హైదరాబాద్: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని బాచుపల్లి మండలం(Bachupally Mandal)లో మేల్ నర్స్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న మేరాజ్ ఆలం(24) బలవన్మరణానికి పాల్పడ్డాడు. మత్తు ఇంజెక్షన్ చేసుకుని నిన్న మధ్యాహ్నం ఆస్పత్రిలోనే ప్రాణాలు తీసుకున్నాడు. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.