26 June, 2026 | 2:10 PM

శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన

18-04-2026 08:43 PM

సిద్దిపేట రూరల్: సిద్దిపేటలోని శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు సికిందర్, సంపత్ ఆసుపత్రి సిబ్బందికి ప్రాక్టికల్‌గా సూచనలు అందించారు. సిద్దిపేటలోని శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు సికిందర్, సంపత్ ఆసుపత్రి సిబ్బందికి ప్రాక్టికల్‌గా సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డా.మురళీ కృష్ణ మాట్లాడుతూ... అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు భయపడకుండా సమయోచితంగా స్పందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎలా స్పందించాలి, రోగులను సురక్షితంగా ఎలా తరలించాలి, అగ్నిని నియంత్రించేందుకు ప్రారంభ దశలో తీసుకోవాల్సిన చర్యలపై సికిందర్, సంపత్ వివరంగా తెలియజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.