18 April, 2026 | 10:17 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి

18-04-2026 08:48 PM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో లక్ష్యాలను సాధించండి

జవహర్ నగర్ డివిజన్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

కీసర డిప్యూటీ కమిషనర్ ఎన్. వసంత

జవహర్ నగర్,(విజయక్రాంతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... తద్వారా దోమల నివారణను అరికట్టవచ్చునని ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల లక్ష్యాలను అనుకున్న మేర సాధించ వచ్చునని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కీసర సర్కిల్ పరిధిలో విజయవంతం చేయాలని కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్.వసంత పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమాన్ని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ అంబేద్కర్ నగర్ డ్వాక్రా భవనంలో శనివారం మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎంటమాలజీ వింగ్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడేలో  భాగంగా దోమకాటు వ్యాధులపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమానికి కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వసంత హాజరై మాట్లాడుతూ దోమకాటు వ్యాధులపై అవగాహనతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేకంగా ప్రజలకు ప్రత్యక్ష అనుభవాల పద్ధతి ద్వారా  దోమల నివారణ కార్యక్రమాలను ప్రజలకు సిబ్బందిచే చేసి చూపెట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో సరైన అవగాహనతోటే పరిసరాలను మన చుట్టుపక్కన ఉన్నటువంటి ఆవరణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చునని తెలిపారు. దోమల నివారణకు  పరిసర ప్రాంతాలను సాధ్యమైనంతవరకు పరిశుభ్రంగా ఉంచుతూ మురికి నీటిని నిల్వ ఉంచకుండా ప్రత్యేక రసాయనాలతో పిచికారి చేసి దోమలను తరిమికొట్ట వచ్చునని తెలిపారు. దోమల నివారణకు దోమతెరలు వంటి సాధనాలు ఉపయోగించి దోమల వ్యాప్తిని అరికట్టవచ్చును తెలిపారు.

మున్సిపల్ పరిధిలో శుభ్రత పరిశుభ్రత నియమాలను పాటించి ప్రజలు స్వచ్ఛంద అవగాహనతో ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రవేశపెట్టిందని ఈ ప్రణాళిక ద్వారా ప్రజలు పరిసరాలపై అవగాహనతో పాటు, వీధి దీపాల పర్యవేక్షణ, మురుగునీటి పారుదల వంటి నివారణ, తద్వారా దోమల నివారణకు ప్రత్యేక అవసరాల కార్యక్రమాల ద్వారా నివారించవచ్చునని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో శానిటేషన్ తదితర విభాగాలు తమ వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ సంతోష్, అనిల్, భాస్కర్, తిరుపతి, రాజు, శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సందీప్, మహిళా సంఘాల గ్రూప్ సభ్యులు కాలనీ అసోసియేషన్ సభ్యులు ఎంటమాలజీ  సిబ్బంది శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.