26 June, 2026 | 6:35 AM

బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ

18-04-2026 09:10 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని మమతా కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు జరగనున్న బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జ్ బానోత్ హరిప్రియ కోరారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇల్లందు, కామేపల్లి, టేకులపల్లి, గార్ల, బయ్యారం మండలాల పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.