14 July, 2026 | 3:56 AM

కాళేశ్వరంపై దుష్ప్రచారం

14-07-2026 12:46 AM
  1. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకే మాపై విమర్శలు
  2. కన్నెపల్లి వద్ద వరద ఉన్నా పంపులు ఆన్ చేస్తలేరు
  3. షాబాద్ సైకోకు రేవంత్‌రెడ్డికి తేడా లేదు
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు 
  5. కానిస్టేబుల్ కిష్టయ్య కూతురుకు ఆర్థిక సాయం

కరీంనగర్, జూలై 13 (విజయ క్రాంతి): ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై, బీఆర్‌ఎస్ నేతలపై దుష్ప్ర చారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పా లనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌లో తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని పరామర్శించా రు.

అనంతరం లోయర్ మానేర్ డ్యామ్‌ను ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భం గా కేటీఆర్ మాట్లాడుతూ.. బనకచర్ల అనుసంధానం అంశంపై సుప్రీంకోర్టులో విచార ణ జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హా మీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభు త్వ విధానాలను ప్రశ్నించడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుపై, తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

షాబాద్ సైకోకు రేవంత్‌రెడ్డికి తేడా లేదని విమర్శించారు. కన్నెపల్లి వద్ద వరద ఉన్నా ఎందుకు పంపులు ఆన్ చేయ డం లేదని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్‌కు రైతులంటే పట్టింపు లేదని విమర్శించారు. వెంటనే కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేయకపోతే మంచినీటి సమస్య తప్పదని హెచ్చ రించారు. రోజుకు ౯ టీంఏంసీల నీరు దిగువకు వృథా పోతుందని, మేడిగడ్డ పైన 18 కిలోమీటర్ దూరంలో కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల నీరు ఉందన్నారు.

మేడిగడ్డ బరాజ్‌తో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని తెలిపారు. కనీసం ఎల్లంపల్లి నుంచైనా నీళ్లు ఎత్తిపోయకుంటే హైదరాబాదుకు మంచినీటి సమస్య వస్తుందన్నారు. మా రక్తం పొలాల్లో చల్లితే పంట లు పండుతాయని మాట్లాడుతున్నారని, మారక్తమే మీకు కావలసి ఉంటే రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

గోదావరిపై ఆధారపడి తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టుల కెపాసిటీ 418 టీఎంసీలు, ప్రస్తు తం అన్ని ప్రాజెక్టుల్లో కలిపి 85 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ౧౦౦ రోజులు నీటిని లిఫ్ట్‌చేస్తే అన్ని ప్రాజెక్టుల నుండి తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు.   

కరీంనగర్‌లో కానిస్టేబుల్ కిష్టయ్య నివాసానికి వెళ్లిన కేటీఆర్, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిష్టయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఇటీవల జన్మించిన కిష్టయ్య మనవడు బేబీ వేదాంత్ రాఘవ కిష్టయ్యను కేటీఆర్ ఆశీర్వదించారు. చిన్నారికి వస్త్రాలు, కానుకలు అందజేశారు. కిష్టయ్య కుమార్తె డాక్టర్ ప్రియాంక మెడిసిన్ విద్యకోసం కేసీఆర్ ఆర్థిక సాయం చేశారు.