సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ అందజేసిన మల్లారెడ్డి
12-06-2026 12:07 AM
ఘట్ కేసర్, జూన్ 11 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంకు చెందిన జస్వంత్ ముదిరాజ్ నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో అనారోగ్యంతో చికిత్స పొందు తున్నందున చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అతని చికిత్స ఖర్చుల కోసం రూ. 2 లక్షల 75 వేలు మంజూరు అయ్యాయి.
అందుకు సంబంధించిన ఎల్‌ఓసి ని గురువారం నగరంలోని బోయిన్ పల్లి లోని ఎమ్మెల్యే మల్లారెడ్డి క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యుడికి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ డివిజన్ ఎస్టీ సెల్ అధ్యక్షులు బిజిలి సదానందం, నాయకులు ఎండి సిరాజ్ పాల్గొన్నారు.






