21 July, 2026 | 10:35 PM

Breaking News

ఘనంగా ఖర్గే జన్మదిన వేడుకలు

21-07-2026 08:51 PM

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదినాన్ని భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. టీపీసీసీ కోఆర్డినేటర్ సిరాజ్ హుస్సేన్, డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఖర్గే సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడిగా ఎదిగిన నాయకుడని, ఆయన నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.