21 July, 2026 | 10:08 PM

Breaking News

బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల వల్లే మేడ్చల్ ప్రజలకు కష్టాలు

21-07-2026 08:48 PM

- బిజెపి నేత వంశీధర్ రెడ్డి

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల అసమర్ధత, స్వార్థం వల్లే మేడ్చల్ పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజెపి నాయకుడు వంశీధర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయించలేకపోతున్నారు. రైల్వే స్టేషన్ రోడ్డు, కె ఎల్ ఆర్ కు వెళ్లే శివాలయం, కోర్టు రోడ్డు, కిష్టాపూర్ రోడ్లు గుంతల మయంగా ఉన్నాయన్నారు.

డ్రైనేజీ పొంగి రోడ్లమీద ప్రవహిస్తోందన్నారు. గతంలో అధికారంలో ఉన్న బిఆర్ ఎస్ నాయకులు అభివృద్ధి చేయలేకపోయారని, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు కూడా అభివృద్ధిని విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. గత పాలకవర్గం పదవీకాలం ముగిసే సమయంలో ఆదరాబాదరగా పనులు చేపట్టడం వల్ల కొన్ని రోజులకే ధ్వంసం అయ్యాయన్నారు. తుమ్మ చెరువు దుస్థితికి గత పాలకవర్గన కారణమని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడం తప్ప నాయకులకు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరిచి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.