8 June, 2026 | 3:30 PM

“ఇండియా కూటమి” కీలక సమావేశం.. మల్లికార్జున ఖర్గే ఉపన్యాసం

08-06-2026 02:10 PM
  1. బీజేపీయేతర ప్రభుత్వాలపై కేంద్రం వివక్ష
  2. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై నిరంతర దాడులు
  3. ప్రతిపక్షాల పోరాటం నిర్ణయాత్మక విజయం
  4. ఇండీ కూటమి ఇప్పటిలో అదే ఐక్యత

న్యూఢిల్లీ: ఇండియా కూటమి భేటీలో(INDIA alliance meetingఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. ఇండియా కూటమి ఇప్పటికీ అదే ఐక్యతతో ఉందని తెలిపారు. లోక్ సభలో డీలిమిటేషన్ బిల్లును ఐక్యంగా అడ్డుకున్నామని ఖర్గే పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రతిపక్షాల పోరాటం నిర్ణయాత్మక విజయమని తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై నిరంతర దాడులు జరుగుతున్నాయని ఖర్గే వెల్లడించారు.

బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల(Non-BJP state governments) పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐని రాజకీయ ప్రత్యేర్థులను వేధించడానికే వాడుతున్నారని ఖర్గే స్పష్టం చేశారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగాల సృష్టికి అవసరమైన పెట్టుబడులు దేశంలోకి రావట్లేదని ఖర్గే ధ్వజమెత్తారు.

పరీక్షల విధానం పూర్తిగా అస్తవ్యస్తమై లక్షలాది యువత భవిష్యత్తు దెబ్బతిన్నదని సూచించారు. కార్పొరేట్ సంస్థల ఏకఛత్రాధిపత్యం పెరిగి, ఎంఎస్ఎంఈ రంగం సంక్షోభంలో పడిందన్నారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో సమాజంలోని బలహీన వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని ఖర్గే ఆరోపించారు. దేశ సంప్రదాయ విలువలు, విదేశాంగ విధానాన్ని కేంద్రం పణంగా పెట్టిందని తెలిపారు. ప్రతిపక్షాల తదుపరి కార్యాచరణను ప్రారంభించాలని ఖర్గే అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ను కోరారు.  కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో INDI అలయన్స్ సమావేశంలో(INDIA Alliance) కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, హాజరయ్యారు.