5 March, 2026 | 5:41 AM

ఘనంగా మల్లికార్జున స్వామి వార్షికోత్సవ కల్యాణం

05-03-2026 01:00 AM

మరిపెడ, మార్చి 4 (విజయక్రాంతి): మరిపెడ మండలం ఉల్లేపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి వార్షికోత్సవ కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఆలయ నిర్వాహకులు, రామడుగు వంశికులు రామడుగు అచ్యుతరావు ఆధ్వర్యంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా సాగింది.

గ్రామ ప్రజలు పరిసర ప్రాంతం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. మంగళ వాయిద్యాలు, హారతుల వెలుగులు, భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.