28 June, 2026 | 3:07 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

24-02-2026 01:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,ఫిబ్రవరి 23(విజయక్రాంతి): కెరమెరి మండలంలోని సావర్ ఖేడ్ గ్రామ శివారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ మధుకర్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సావర్‌ఖేడ్ గ్రామ శివారులో వాహన తనిఖీలు చేపడుతుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న సరోజిత్ మండల్‌ను తనిఖీ చేయగా,

అతని వద్ద నుంచి 210 గ్రాముల గంజాయి లభ్యమైంది.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5,250 ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.గంజాయి విక్రయం, కొనుగోలు లేదా వినియోగంలో పాల్గొన్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.