15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

న్యాయవాది కళ్యాణిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి

24-02-2026 12:58 AM

జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి  

నిజామాబాద్ ఫిబ్రవరి23 (విజయక్రాంతి): బోధన్ డివిజన్ రుద్రూర్లో న్యాయవాది కళ్యాణి పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు దినేష్ కులచారి డిమాండ్ చేశారు. ఈ దాడి ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని,హిందువులపై దాడులు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రుద్రూర్లో న్యాయవాది కళ్యాణి పై దాడి తో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపుతప్పిందని, హిందువులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

మొన్న బాన్సువాడలో, నిన్న రుద్రూర్లో జరిగిన ఘటనలు కేవలం యాదృచ్ఛికం కావని, ఇవి పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్న దాడులేనని దినేష్ పటేల్ కులాచారి  ఆరోపించారు. రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మౌనం వహించడం వెనుక తీవ్రమైన రాజకీయ స్వార్థాలు ఉన్నాయనే అనుమానాన్నీ ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చేసిన కాంగ్రెస్ అంటే ముస్లిం  ముస్లిం అంటే కాంగ్రెస్ అనే వ్యాఖ్యలు ఎందుకు నిదర్శనం అన్నారు. 

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, దాని ఫలితంగానే రాష్ట్రంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింత శ్రీనివాస్ రెడ్డి, ప్రమోద్ కుమార్, నూతల శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్, జగన్ రెడ్డి, ఆనంద్ రావు, గడ్డం రాజు, బొబ్బిలి వేణు, నరేష్, అమంద్ విజయ్ కృష్ణ, చిరంజీవి, శ్రీకాంత్, ప్రతాప్, అర్జున్ రెడ్డి పాల్గొన్నారు.