calender_icon.png 27 November, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

11-02-2025 10:55:08 PM

కొండపాక: జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట ఎక్స్ రోడ్డు వద్ద జరిగింది. కుక్కునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ లో నివాసం ఉంటున్న జగిత్యాల జిల్లా పూడూరు గ్రామానికి చెందిన గట్ల శ్రీనివాస్(52) సోమవారం వెలికట్ట ఎక్స్ రోడ్డు శివారులో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, స్టానికుల సహాయంతో అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. మృత్తుని కుమారుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.