12-02-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) : రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందిన సంఘ టన మంగళవారం చోటుచేసుకుంది. మోత్కూర్ మండలం దాచారం గ్రామ హైస్కూల్‌లో ఇంగ్లీషు ఉపాధ్యాయురాలు జబీనా బేగం విధులు నిర్వహిస్తున్నారు.
మంగళవారం అడ్డగూడూరు మండల కేంద్రంలో జరిగే స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ కు వస్తుండగా జాతీయ రహదారిపై బొడ్డ గూడెం చౌల్ల రామారం గ్రామాల మధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొని తల చింద్రమై అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసు పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీచర్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.