calender_icon.png 27 November, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొండి బకాయిలు వసూలు

27-11-2025 02:15:04 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఎస్.హెచ్.జి సభ్యుల నుండి 80 వేల,, రూపాయలు మొండి బకాయి వసూలు చేసినట్లు మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. మండలంలోని రాఘవపల్లి గ్రామంలో గురువారం స్వయం సహాయక సంఘాల మొండి బకాయిలు వసూలు నిమిత్తం ఐకెపి,బ్యాంకు మరియు గ్రామ సంఘం మహిళల ఆధ్వర్యంలో రికవరీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని మండల ఇన్చార్జి ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ అన్నారు.స్పెషల్ డ్రైవ్లో భాగంగా సంఘ సభ్యుల నుంచి 80 వేల,,రూపాయలు మొండి బకాయిలు వసూలు చేయడం జరిగిందన్నారు.గ్రామంలో మండలంలో ఇంకా ఎవరైనా శ్రీనిధి ద్వారా,బ్యాంకు రూపంలో రుణాలు తీసుకుంటే సకాలంలో చెల్లించాలన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ జ్ఞానేశ్వర్ కుమార్,ఫీల్డ్ ఆఫీసర్ ముత్యం రెడ్డి,ఐకెపి సీసీ దత్తు,వివోఏ సాయిలు తదితరులు ఉన్నారు.