27-11-2025 02:13:11 PM
8 మందికి, నాలుగు గేదెలకు కాటు.
పట్టించుకోని మున్సిపల్ అధికారులు.
తాండూరు, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్(Tandur Municipality) పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత 24 గంటల్లో 8 మందికి మరియు నాలుగు గేదెలను తీవ్రంగా కాటేశాయి. మల్ రెడ్డి పల్లి మున్సిపల్ పరిధి వార్డు నెంబర్ 1 లో నిత్యం వీధి కుక్కల బెడదతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఎటు వైపు నుండి కుక్కలు పైకి వచ్చి కాటేస్తాయోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నారులు పాఠశాలలకు వెళ్లాలంటే భయంతోనే వెళ్తున్నారు. మల్ రెడ్డి పల్లి ప్రాంతంలో గత రాత్రి నలుగురు వ్యక్తులను కుక్కలు కాటేయ్యగా, మరో నాలుగు లేగ దూడలపై సైతం వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. వీధి కుక్కల బెడద తీర్చాలని సమస్యను పరిష్కరించాలని మునిసిపల్ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.