27-11-2025 03:35:57 PM
కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే.. గంటల్లోనే బీసీ రిజర్వేషన్లు
కాంగ్రెస్ రిజర్వేషన్ల పక్షపాత పార్టీ
బీజేపీది ఫ్యూడల్ మనస్తత్వం
బీజేపీ సహకరించలేదు
హైదరాబాద్: విపక్ష పార్టీలకు చరిత్ర తెలుసా?, సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత విపక్షాలకు ఉందా? అని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించామని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ సహకరించలేదని మంత్రి వివరించారు. బీసీ రిజర్వేషన్ల(BC reservations) అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని విధాల ప్రయత్నించామని వెల్లడించారు. కాంగ్రెస్ రిజర్వేషన్లకు పక్షపాతి పార్టీ అన్నారు. ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నపార్టీ బీజేపీ(Bharatiya Janata Party) అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉండి ఉంటే.. గంటల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కేవని వివరించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేత లక్ష్మణ్ మొసలికన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.