15 June, 2026 | 10:36 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

30-03-2026 12:25 AM

పాపన్నపేట,మార్చి29: మనస్థాపంతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో ఆదివారం చోటు చే సుకుంది. ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన ఫిరంగి సత్యనారాయణ (50) కల్లు వ్యాపారం చేస్తూ జీవితం సాగిస్తున్నాడు. కాగా వారం రోజుల క్రితం ఈయన పెద్ద కూతురు నిశ్చితార్థం జరిగింది. దీంతో త్వరలో వివాహం ఉండడంతో వివా హానికి నగదు లేక అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు.

అప్పు ఎక్కడ దొరక్కపోవడంతో మనస్థాపం చెందిన అతను శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టూ పక్కల వెతకగా ఆదివారం ఉదయం సమయంలో గ్రామ శివారులోని రోడ్డు పక్కనే పాడుబడిన రైస్ మిల్లులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు.