వనదుర్గమ్మ ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి
కలెక్టర్ ప్రతిమా సింగ్
పాపన్నపేట,మార్చి29: మంజీరా నదీ తీరాన వెలసిన అత్యంత మహిమాన్విత క్షేత్రంఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయమని, భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం వనదుర్గా భవాని మాత అని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ఏడుపాయల వనదుర్గామాతను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో వీరేశం, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారి పేర ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాభవాని మాత ఆలయం అత్యంత గౌరవనీయమైన మందిరంగా పేర్కొన్నారు. వనదుర్గమ్మ ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ ఆయురారో గ్యాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఈ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారన్నారు. వారి వెంట ఈవో వీరేశం, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.




