28 May, 2026 | 1:54 AM

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

28-05-2026 12:00 AM

ఘట్‌కేసర్, మే 27 (విజయక్రాంతి) : చెడు వ్యసనాలు, అప్పుల బాధతో మనస్తాపానికి గురైన ఓవ్యక్తి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘట్కేసర్ డివిజన్, ఎన్.ఎఫ్.సి నగర్ పరిధిలోని పరమేశ్వరి నగర్లో నివసించే ఉప్పల రవీందర్ (41) అనే వ్యక్తి పరాస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో అటెండర్గా పనిచేసేవాడు.

గత కొంతకాలంగా చెడు అలవాట్లకు బానిసైన రవీందర్ ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టడంతో పాటు పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో అతని భార్య స్నేహలత పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. నిన్న రాత్రి భార్యతో ఫోన్లో మాట్లాడిన రవీందర్, బుధవారం ఉదయం ఆమె ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు.

అనుమానం వచ్చిన భార్య స్థానికంగా ఉన్న తన బావ మహేష్ను ఇంటికి వెళ్లి చూడమనగా బెడ్రూమ్లో రవీందర్ సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాల వల్ల తీవ్ర డిప్రెషన్కు లోనై రవీందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య స్నేహలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.