28 May, 2026 | 1:54 AM

ధాన్యాన్ని ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించాలి

28-05-2026 12:00 AM

కలెక్టర్ హేమంత్ సహదేవరావు

ములుగు (మహబూబాబాద్) మే 27 (విజయక్రాంతి): రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు మండలం ఇంచర్ల గ్రామంలోని పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్. మహేందర్‌జీతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తూకం విధానం, తేమ శాతం నమోదు, రికార్డుల నిర్వహణ, ధాన్యం నిల్వ విధానం తదితర అంశాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతు లకు తాగునీరు, నీడ, వంటి మౌలిక సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని సంబంధి త అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం చోటు చేసుకోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.

రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాల ప్రకారం వేగంగా కొనుగోలు చేసి, కొనుగోలు అనంతరం ధాన్యాన్ని ఆల స్యం చేయకుండా వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాల్లో తగిన టార్పా లిన్లు, కవర్లు సిద్ధంగా ఉంచాలని, ధాన్యం తడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షం కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, రైతులకు డబ్బుల చెల్లింపులు సమయానికి జరిగేలా చర్యలు తీసు కోవాలని తెలిపారు.

రైతులు ఎటువంటి మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర ప్రభు త్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిఎం క్రిష్ణవేణి,సంబంధిత శాఖల అధికారులు, పిఏ సిఎస్ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, కొనుగోలు కేంద్ర సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.